చిత్రసీమ నేపథ్యంతో ‘వాల్‌పోస్టర్’

మన్మోహన్, మధుశర్మ జంటగా స్నేహారెడ్డి క్రియేషన్స్ పతాకంపై విజయ్ దర్శకత్వంలో వెంకట్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వాల్‌పోస్టర్’. గురువారం రాత్రి ఈ చిత్ర ప్రోమోస్‌ను సారిపల్లి కొండలరావు, వెబ్‌సైట్‌ను ఎన్.జి.జి.నాయుడు, లోగోను బొద్దులూరి రామారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ-‘చిత్ర పరిశ్రమకు సంబంధించి 24శాఖల కార్మికుల కథలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఒక సారి తమ బొమ్మను వాల్‌పోస్టర్‌పై చూసుకోవాలన్న ఆశతో అనేకమంది పరిశ్రమకు వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. లారెన్స్ అందించిన సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలువనుందన్నారు. వనితారెడ్డి, రవళి, అర్చన, కృష్ణ, భువనేశ్వరి, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు, కృష్ణ్భగవాన్, జీవా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వాసు, ఆర్ట్: రమణ వంక, ఎడిటింగ్: వి.నాగిరెడ్డి, పాటలు: భాస్కరభట్ల, కలువసాయి, సి.వేణు, సంగీతం: లారెన్స్.డి, నిర్మాత: వెంకటరెడ్డి, రచన, దర్శకత్వం: విజయ్.

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
Image CAPTCHA
Enter the characters (without spaces) shown in the image.

జిల్లాలు

Poll

కోడిపందాల జాతరను ...............: